హై టెన్షన్ వైర్లను పట్టుకున్నాడు.. చివరికి మొత్తం బూడిదే..?

praveen
సాధారణం గా కరెంట్ అంటే ప్రతి ఒక్కరూ భయ పడి పోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఇంట్లో ఎక్కడైనా వైర్ తేలి ఉన్నట్లు కనిపించింది అంటే ఇక అటు వైపు వెళ్లడానికి భయపడి పోతుంటారు ఇక అదే బయట ఉండే పెద్ద కరెంటు వైర్లను చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలాంటిది హై టెన్షన్ వైర్లు చూస్తుంటే ఇక గుండెల్లో గుబులు  పుడుతూ ఉంటుంది.  ఇక అలాంటిది హై టెన్షన్ వైర్లు పట్టు కోవడం అంటే అందుకు ఎంతో ధైర్యం కావాలి.  ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది హై టెన్షన్ వైర్లు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


 ఈ విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఏకంగా హైటెన్షన్ వైర్లకు  ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారి పోయింది. వివరాల్లోకి వెళితే.. మల్యాల మండలం లో జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పై 130కేవి  కరెంట్ టవర్ వుంది. ఇక ఇటీవలే ఈ హైటెన్షన్ వైర్లు ఉన్న టవర్ ఎక్కిన ఒక గుర్తు తెలియని వ్యక్తి హైటెన్షన్ వైర్లకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్థానికులు అందరూ ఒక్క సారిగా షాకయ్యారు.



 సాధారణ విద్యుత్ తీగలు పట్టుకుంటేనే  మనిషి మృతదేహం మొత్తం కాలి పోతుంది. ఇక హై టెన్షన్ వైర్లను పట్టుకోవడంతో మృతదేహం మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా బూడిద గా మారి పోయింది. దీంతో షాక్ అయిన స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమం లోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: