కోవాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి.. కలవరపడుతున్న ప్రజలు.?

praveen
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రాణాల ను బలి తీసుకున్న వైరస్ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు వాక్సినేషన్ ప్రక్రియను  ప్రారంభించాయి. ఈ క్రమం లోనే ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇక భారతదేశం లో కూడా రెండు రకాల వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలందరూ ఎంతగానో ఆనంద పడి పోయారు అనే విషయం తెలిసిందే. వ్యాక్సిన్  లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాల విమర్శలను నేపథ్యంలో ఇక వ్యాక్సిన్పై ఎన్నో అనుమానాలు ప్రజలందరిలో నెలకొన్నాయి .

 ఇలాంటి క్రమంలోనే టీకా తీసుకున్న వారు మృతి చెందారు అనే వార్తలు కూడా అందరిని మరింత కలవరపెడుతున్నాయి.. అయితే ఇటీవలే దేశీయ వ్యాక్సిన్ కోవాక్సిన్  తీసుకున్న ఒక వాలంటీర్  మృతిచెందడంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. కోవాక్సిన్   తీసుకున్న తర్వాత వాలంటీర్ పది రోజులకు మృతిచెందాడు అనే వార్తలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. మూడవ దశ క్లినికల్ టైల్స్ పూర్తి చేయకుండానే అనుమతి ఇవ్వడం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా ఇలాంటి వార్తలు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

 భూపాల్ కు చెందిన దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 12వ తేదీన పీపుల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో నిర్వహించిన కోవాక్సిన్  ట్రయల్స్  లో పాల్గొని వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇక పది రోజుల తర్వాత మరణించాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై మాట్లాడిన మెడికల్ కాలేజీ వైస్ ఛాన్స్లర్.. విషప్రయోగం కారణంగానే అతను చనిపోయాడు అని అనుమానిస్తున్నామూ. మరణానికి అసలు కారణమేంటో తెలియరాలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ వార్త మాత్రం ప్రస్తుతం ప్రజలందరినీ ఎంతగానో భయాందోళనకు గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: