కన్యాదాతగా మారిన అన్న.. కానీ అంతలో ప్రాణం పోయింది..?
ఈ విషాదకర ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. తోగుట మండలం ఎల్లారెడ్డిపేట కు చెందిన పరశురాములు చెల్లి వివాహం ఇటీవలే జరిగింది. ఇక తనకు కూతురు లేకపోవడంతో ఏకంగా చెల్లి పెళ్లికి కన్యాదాతగా మారి సోదరి వివాహం జరిపించాడు అన్న. సిద్దిపేట మండలం బంధువులను దించేందుకు సాయంత్రం బయలు దేరాడు. ఈ క్రమంలోనే కారులో ఆరుగురు ప్రయాణికులు వెళ్లగా.. ఇద్దరు బంధువులను వారి ఇంటి దగ్గర దించేసి మిగిలిన నలుగురు తిరిగి వస్తున్న సమయంలో.. అతి వేగం కారణంగా కారు ఓ చెట్టును వేగంగా ఢీకొట్టింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న పరశురాములు అక్కడికక్కడే మరణించాడు. చిన్నాన్న కొడుకు నాగేష్.. తమ్ముడు బావమరిది రాగుల అజయ్ తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. వీరిద్దరూ కూడా చికిత్స పొందుతూ మరణించారు. మరో బంధువు కూడా తీవ్ర గాయాల బారిన పడడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.