స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?
హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారి కోసం ప్రస్తుతం బంపరాఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఆఫర్ ద్వారా హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి భారీ ఊరట కలగనుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి వడ్డీ రేట్లపై30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ అందిస్తోంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీంతో హోమ్ లోన్ తీసుకునే వారికి ఈ ప్రయోజనాలతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలోనే హోమ్ లోన్ తీసుకోవాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెబుతున్నారు నిపుణులు.
స్టేట్ బ్యాంక్‌లో రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంటుంది. రూ.30 లక్షలకు పైన హోమ్ లోన్ తీసుకుంటే 6.95 శాతం వడ్డీకే లోన్ వస్తుంది. అయితే ఇక్కడ మీ హోమ్ లోన్ వడ్డీ ట్లు సిబిల్ స్కోర్‌తో లింక్ అయ్యి ఉంటాయని ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంటుంది. రూ.5 కోట్ల వరకు హోమ్ లోన్స్‌కు 30 బేసిస్ పాయింట్ల తగ్గింపు లభిస్తుంది. 8 మెట్రో నగరాల్లో ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది. మహిళలు హోమ్ లోన్ తీసుకుంటే 5 బేసిస్ పాయింట్లు తగ్గింపు లభిస్తుంది. అదే ఎస్‌బీఐ యోనో ద్వారా లోన్ పొందితే 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.