పర్సనల్ లోన్ కావాలా.. తక్కువ వడ్డీకే ఈ బ్యాంకుల్లో తీసుకోండి..?
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమకు అవసరమైనప్పుడల్లా ఇలా వివిధ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను పొందుతూ ఎంతగానో లబ్ది పొందుతున్నారు. లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసే వారికి ప్రస్తుతం తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వెంటనే బ్యాంకు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే లోన్ తీసుకునే ముందు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. లోన్ వడ్డీ రేటు ఎంత ఉంది అనేదాన్ని బట్టి లోన్ తీసుకోవడం ఎంతో మంచిది.
అందుకే మీరు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకే రుణం అందుతుంది అని ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత లోన్ కోసం అప్లై చేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం తక్కువ వడ్డీకే తమ కస్టమర్లకు పర్సనల్ లోన్ అందిస్తున్న బ్యాంకులు ఏవో చూద్దాం.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల కంటే అతి తక్కువ వడ్డీకి ప్రస్తుతం పర్సనల్ లోన్ అందిస్తుంది ఈ బ్యాంకు యొక్క వడ్డీ రేటు కేవలం 8.8 శాతం తో ప్రారంభమౌతుంది. ఇక ఈ బ్యాంకు తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది 8.95 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది.
సెంట్రల్ బ్యాంక్ కూడా 8.95 శాతం వడ్డీ రేటుకే లోన్ అందిస్తోంది. ఇండియన్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 9.05 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో వడ్డీ రేటు 9.55 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ఇక దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 9.6 శాతంగా ఉంది.
యూకో బ్యాంక్‌లో అయితే వడ్డీ రేటు 10.05 శాతం నుంచి ప్రారంభమౌతోంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్సనల్ లోన్ వడ్డీ రేటు 10.10 శాతంగా ఉంది. ఫెడరల్ బ్యాంక్ కూడా 10.49 శాతం వడ్డీ రేటుకే రుణాలు అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.75 శాతం నుంచి ప్రారంభమౌతోంది.