ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

praveen
ప్రస్తుతం భారత్ డిజిటల్ భారత్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.  రోజు రోజుకు నగదు లావాదేవీలు తగ్గి మొత్తం ఆన్లైన్ లావాదేవీల పెరిగిపోతున్నాయి. అయితే రోజురోజుకు అటు తమ కస్టమర్లను ఆన్లైన్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు కోసం ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ యాప్స్ కూడా ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్న నేపథ్యంలో రోజురోజుకీ.. డిజిటల్ పేమెంట్స్  చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు నేటి రోజుల్లో జనాలు. ఈ క్రమంలోనే రోజురోజుకు వినియోగదారులను ఆకర్షిస్తూ అద్భుతమైన ఆఫర్లతో ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ దూసుకుపోతోంది ప్రముఖ పేమెంట్స్ ప్లాట్ఫాం ఫోన్ పే.



 అయితే ఇటీవలే ఫోన్ పే  తమ వినియోగదారులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫోన్ పే తమ కస్టమర్ల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.  అయితే దీనికోసం ఫోన్ పే తాజాగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఫోన్ పే. అయితే ఫోన్ పే అందిస్తున్న టర్మ్ పాలసీల ప్రీమియం సంవత్సరానికి 149 రూపాయలు తో ప్రారంభం అవుతుంది.  అంతేకాదు క్షణాల వ్యవధిలోనే ఇన్సూరెన్స్ పాలసీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.




 అయితే ప్రస్తుతం ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఎలాంటి హెల్త్ చెక్ అప్ లో కూడా అవసరం లేదు అనే చెప్పాలి. అంతేకాకుండా ఎలాంటి పేపర్లు కూడా అందించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే క్షణాల వ్యవధిలో పాలసీని అప్లై చేసుకుని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఫోన్ పే ద్వారా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పాలసీదారులకు ఎలాంటి డబ్బులు రావు. పాలసీ తీసుకున్న తర్వాత గడువులోపు పాలసీదారుడు మరణిస్తే ఆ డబ్బులు ఇన్సూరెన్స్ మొత్తం  కుటుంబానికి వెళ్తాయి. ఇక ఫోన్ పే లో  మనీ ఆప్షన్ లోకి వెళ్లి ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: