భార్యను హత్య చేసిన భర్త.. ఆ తర్వాత ఏం చేసిండంటే..!?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పైడిమడుగు గ్రామానికి చెందిన గంగజను ఇబ్రహీంపట్నం మండలం తిమ్మపూర్ గ్రామానికి చెందిన గోపాల్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. గోపాల్, గంగజ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య గ్రామమైన పైడిమడుగులోనే గోపాల్ నివాసం ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా భార్య భర్తల మధ్య విబేధాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ పనిచేయకుండా ఇంటి వద్దనే ఉంటున్న మద్యానికి బానిసగా మారాడు. ఈ విషయంలోనే పలుమార్లు భార్యతో వాదనకు దిగాడు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భార్య గంగజతో గోపాల్ ఘర్షణ దిగాడు. మద్యం మత్తులో విచక్షణ మరిచి ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం గంగజుల ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతిచెందిన ఆమెను చీరతో ఉరి వేసి.. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. తమ కూతురుని ఆమె భర్తే హత్య చేశాడని గంగజ కుటుంబ సభ్యులు తెలిపారు. రోజు తాగి వచ్చి గంగజతో గొడవపడేవాడని చెప్పారు. గోపాల్‌కు బయటినుంచి తాము కూడా అప్పులు అడిగిచ్చామని అన్నారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.