ఎర్రచీమల కర్రీ తో కరోనా అంతం.. శాస్త్రవేత్త చెప్పిన నిజం..?
త్వరలో భారతదేశంలో ఎర్ర చీమల కర్రీకి ఎంతో డిమాండ్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే దీని వెనుక కారణం కూడా లేకపోలేదు. ప్రపంచం నుంచి కరోనా వైరస్ ని తరిమి వేయడానికి ఎర్ర చీమలు పచ్చడి ఎంతోగానో పనిచేస్తుందని.. ఎర్ర చీమలతో చేసిన పచ్చడి కారణంగా జలుబు దగ్గు జ్వరం లాంటివి తగ్గడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఉపశమనం కలుగుతుందని.. దీనిని గిరిజనుల ఔషధంగా వాడుతూ ఉంటారని..కాబట్టి కరోనా చికిత్సలో ఎర్ర చీమల పచ్చడి ని వినియోగించడం పై అధ్యయనం చేయాలి నాయదార్ఫ్ శాడియల్ అనే ఒక శాస్త్రజ్ఞుడు కోర్టులో కేసు వేశాడు
ఈ విషయాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంప్రదించి ఆదేశాలు జారీ చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు ఆ శాస్త్రజ్ఞుడు. కాగా కోర్టు కూడా ఈ పిటిషన్ పై స్పందిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వాలని కోరింది. ఒకవేళ ఆయుష్ మంత్రిత్వ శాఖ తాము దీనిపై అధ్యయనం చేస్తాము అని ఒప్పుకుంటే గనుక ఇక పెద్దఎత్తున ఎర్ర చీమ లకు డిమాండ్ పెరిగిపోయే అవకాశం ఉందని.. ఎర్ర చీమలు ఇన్ని రోజుల వరకు కుట్టాయి అని తిట్టుకున్న వారు ఇప్పుడు ఎర్ర చీమలు కోసం తిరిగే రోజు వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.