ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ శుభవార్త ను ప్రకటించారు. ఈ కీలక నిర్ణయం ద్వారా సీఏపీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పలు విభాగాల్లో పనిచేసే వారికి భారీ ఊరట కలగనుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణలోకి తీసుకున్న మోదీ సర్కారు... అధికారులతో భేటీ నిర్వహించి... ఈ రకంగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుండి మరింత సహాయ సహకారాలు అందించాలని ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేశామని జితేంద్రసింగ్ వెల్లడించారు. తద్వారా ఎంతో మంది ఉద్యోగులు తమ జీవితాన్ని భారంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ వెసులుబాటు తో సంతోషంగా ఉంటుందని తెలిపారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఉద్యోగులకు ఈ గుడ్ న్యూస్ అందడం ద్వారా వారిలో నూతన ఉత్సాహం మరింత పెంచింది. 2004 జనవరి 1 లేదా తర్వాత ఉద్యోగాల్లోకి చేరిన వారికి.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ పరిగణలోకి వచ్చే వారికి ఇంతకుముందు ఎలాంటి పరిహారం ఉండేది కాదని, అయితే ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్తరూల్స్ వల్ల పరిహారం లభిస్తుందని అటువంటి ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తుందని జితేంద్రసింగ్ అన్నారు. మోడీ సర్కార్ నిబంధనలను సరళతరం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకొని ఉద్యోగులకు మరింత సహాయాలు అందించేందుకు ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు లేని జీవనం కొనసాగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని... ఇందుకు కూడా కేంద్రం తమ వైపు నుండి యోచిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.