కొత్త ఏడాదిలో కొత్త వైరస్.. వణికి పోతున్న జనాలు..?

praveen
దేశాన్ని మొత్తం అతలా కుతలం చేస్తున్న కరోనా వైరస్ భయం వీడక ముందే కొత్త వైరస్ లు  వెలుగు లోకి వచ్చే ప్రజలందరి నీ మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  కరుణ కరోనా  చీకట్లు ఇప్పుడిప్పుడే తొలగి పోతున్నాయి అనుకుంటున్న తరుణం లో యూకే లో కొత్త రకం కరోనా  వైరస్ వెలుగు లోకి వచ్చి అలజడి రేపుతుంది. కరోనా వైరస్ కేసులు తగ్గు ముఖం పడు తున్నాయి కొత్త ఏడాది లో అయినా కాస్త మంచి జరుగుతుంది అందరూ అనుకున్నప్పటికీ కొత్త వైరస్ భయాందోళన కు గురి చేస్తుంది.  ఇక కొత్త సంవత్సరం లో మరో కొత్త వైరస్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలుచోట్ల అందరినీ భయ పెడుతుంది.


 దేశ వ్యాప్తం గా పలు ప్రాంతా లలో బర్డ్ ఫ్లూ కేసులు భారీగా బయట పడుతూ ఉన్నాయి పెద్ద మొత్తంలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి.  నెమళ్లు కాకుల తో పాటు ఇతర పక్షులు కూడా వేల సంఖ్యలో మరణిస్తూ ఉండడం అందరిని ఆందోళన కలిగిస్తోంది.  ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు మరణించిన పక్షులకు పరీక్షలు నిర్వహించగా హెచ్5ఎన్8 వైరస్ వచ్చినట్లు తేలింది.  ఇక ఈ వైరస్ తో  ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.  ఇప్పటికే ఈ కొత్తరకం వైరస్ సోకి రాజస్థాన్లోని నాగపూర్ జిల్లాలో 50 కి పైగా నెమళ్లు మరణించాయి.


 వీటితోపాటు కాకులు పావురాలు కూడా చనిపోయాయి.  ఒక మరోవైపు ఝాల  బాద్ ప్రాంతంలో వందకు పైగా కాకులు మరణించాయి.  ఈ క్రమంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉన్నఫలంగా  భారీ సంఖ్యలో కాకులు మరణించడంతో అధికారులు కూడా కంగారు పడిపోయారు పరీక్షలు నిర్వహించగా కొత్త వైరస్ బయటపడింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నమూనాలను సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: