గుడ్ న్యూస్.. గ్యాస్ బుక్ చేసిన గంటల్లోనే డెలివరీ..?

praveen
ప్రస్తుతం రోజురోజుకు గ్యాస్ వాడకం ఎంతలా పెరిగిపోతుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ వినియోగం తప్పనిసరి గా మారిపోయింది ఈ క్రమంలోనే ప్రజలందరికీ కూడా గ్యాస్ సేవలు అందించేందుకు ప్రస్తుతం ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి ముఖ్యంగా ప్రస్తుతం హెచ్ పి.. ఇండిన్..  భారత్ గ్యాస్ లాంటివి ప్రస్తుతం జనాలు అందరికీ కూడా ఎల్పీజీ సేవలు అందిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక దీనిలో ఎక్కువ ప్రజాదరణ కలిగిన గ్యాస్ ఏజెన్సీ ఇండిన్. ఎక్కువ మంది వినియోగదారులు ఇండిన్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..


 అయితే ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులందరికీ మరింత మెరుగైన సేవలు అందించేలా ఆయా గ్యాస్ కంపెనీ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమ కస్టమర్లకు శుభవార్త చెబుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఇండిన్ గ్యాస్ తమ వినియోగదారుల అందరికీ శుభ వార్త చెప్పింది. ప్రస్తుతం కొత్త ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదని కేవలం ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది అంటూ చెబుతోంది ఇండిన్ గ్యాస్ సంస్థ.



 ఇండిన్ గ్యాస్ వినియోగదారులు అందరూ కూడా ఒక్క మిస్డ్ కాల్ తో కొత్త ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఐవీఆర్ఎస్ తో సంబంధం లేకుండా 8454955555 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి క్షణాల వ్యవధిలో కొత్త ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యానికి కేంద్రమంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. డిజిటల్ ఇండియా లో భాగంగా ఈ సరికొత్త సౌకర్యాన్ని ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ సర్వీస్ పూర్తిగా ఉచితమని ఎలాంటి చార్జీలు పడవు అని అంతేకాకుండా సిలిండర్ బుక్ చేసిన గంటల్లోనే డెలివరీ అవుతుంది అంటూ ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: