అమ్మో ఇన్ని ట్విస్ట్ లా ? పీసీసీ అధ్యక్ష రేసులో మరో పేరు ?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, 1,2 స్థానాల్లో కూడా ప్రభావం చూపించే స్థాయిలో లేకపోయినా , ఆ పార్టీ నాయకులు మాత్రం పార్టీ పదవుల కోసం పోరాటం చేస్తున్న తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది.
మామూలుగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు కొదవే లేదు. దీంతో ప్రతి ఒక్కరూ తమ గొప్పతనాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే , మిగతా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, మొత్తం పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తూ రావడం సర్వసాధారణంగా మారిపోయింది. పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తున్నా, అది ఒక కొలిక్కి మాత్రం రావడం లేదు. దీనికి కారణం పదవి ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే.
రోజుకో కొత్త పేరు తెరపైకి రావడం తో అది సాధ్యపడటం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , మల్లు భట్టి విక్రమార్క ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరికీ ఆ పదవి దొరుకుతుందా అన్ టెన్షన్ అందరిలో ఉండగానే, ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి వేణుగోపాల్ ను సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి కలిశారు పిసిసి అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగిస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన చెప్పినట్లు సమాచారం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన తండ్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక బాధ్యతలు స్వీకరించాను అని, పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే నిర్వహించగల సత్తా తనకు ఉంది అని శశిధర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా పాటిస్తానని శశిధర్ రెడ్డి వారికి చెప్పారట. పిసిసి అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుని పోయే, అనుభవం ఉన్న నాయకుడికి అప్పగించాలని శశిధర్ రెడ్డి చెప్పినట్టు సమాచారం.
కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రజలకు, నాయకులకు నమ్మకం కలిగించాలని శశిధరూర్ రెడ్డి సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికి వారు పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన తిరిగి భారత్ కు వచ్చిన తర్వాత గాని, ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: