ఇంతకన్నా వింత ఉండదు.. చెట్లు నరికి నీళ్ళు కాపాడతారట.?
ఇప్పటికే నీటి ధరలు కూడా పెరిగి పోతున్న నేపథ్యం లో ఇక 2060 సంవత్సరానికల్లా ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో వాటర్ కొరత వచ్చే అవకాశం ఉంది అని తెలిసినప్పటికీ ఎవరు కూడా నీటిని ఆదా చేయడానికి అస్సలు ఒప్పుకోరు. ఇక కొన్ని కొన్ని దేశాలలో అయితే నీటికొరత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి. అలాగని ఆయా దేశాలు నీటి కొరత రాకుండా తగిన జాగ్రత్తలు చేపడుతున్నాయా అంటే వింతైన ఆలోచనలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసే పనులు చేస్తున్నాయి.
ఇటీవల సౌత్ ఆఫ్రికా లో నీటి కొరత ఏర్పడిన నేపథ్యం లో సౌతాఫ్రికాలో చెట్ల కారణంగా నీటి కొరత ఏర్పడిందని పాలకులు భావించారు. అక్కడ ఉన్న నీరు మొత్తం భూగర్భ జలాల్లోకి వెళ్లకుండా చెట్లు పూర్తిగా పీల్చుకుంటున్నాయని.. అందుకే పూర్తిగా చెట్లను నరికివేయడం కారణం గా నేరుగా నీరు భూగర్భ జలం లోకి వెళ్లి భూగర్భంలో జల వనరులు పెరిగే అవకాశం ఉందని అక్కడి పాలకులు ప్లాన్ చేసినట్లుతెలుస్తుంది. ఈ క్రమంలోనే చెట్ల నరికివేత కోసం అన్నీ సిద్ధం కూడా చేస్తున్నారట.