మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. నేటి నుంచి మళ్లీ మొదలయ్యాయ్.?

praveen
కరోనా వైరస్ కారణంగా ఎవరికైనా ఉపశమనం లభించింది అంటే అది మందుబాబులకు అని చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మందుబాబులకు ఎంతో ప్రయోజనం చేకూరింది అనే చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు వరకు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు..  మద్యం తాగి వాహనం నడిపిన వారికి భారీ జరిమానాలు విధించడం లేదా శిక్ష విధించడం లాంటివి కూడా చేసారు.

 దీంతో మందుబాబులు అందరూ కూడా మద్యం తాగి వాహనం నడవాలంటే భయ పడే పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు అంటే ఇక భారీగా జరిమానాలు విధిస్తూ ఉన్న నేపథ్యంలో ఇక మందుబాబులు మద్యం తాగి వాహనం నడప లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు పూర్తిగా బ్రేక్ వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మందుబాబుల అందరికీ ఎంతగానో ఉపశమనం లభించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు లేకపోవడంతో ఎంతో మంది మందుబాబులు ఫుల్లుగా మద్యం తాగి వాహనం నడిపిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇక నుంచి మాత్రం అలాంటిది కుదరదు అన్నది అర్థం అవుతుంది.  తెలంగాణ సర్కార్ తాజాగా ఇచ్చిన ఆదేశాలతో నేటి నుంచి మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి డిసెంబర్ 31న ఎంతోమంది తాగి వాహనాలు నడిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: