దారుణం : పసిపాపను గోనెసంచిలో కుక్కి.. చివరికి..?

praveen
ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు సభ్య సమాజంలో మనిషి అనే వాడు ఉన్నాడా అనే అనుమానం కలగక మానదు.  సాటి మనుషుల ప్రాణాలు విషయంలో కాస్తయినా మానవత్వాన్ని చూపించడంలేదు మనుషులు. క్రూర మృగాల  కంటే ప్రమాదకరంగా మారిపోతున్న మనుషులు ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడంలో కాస్తయినా వెనకడుగు వేయకుండా దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి. ఓ వైపు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలతో సమాజం మొత్తం భయపడుతూ బతుకుతుంటే మరోవైపు ఉన్మాదులు గా మారుతున్న మనుషులతో ఏ  క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



 ఈ మధ్య కాలంలో దేశంలో కిడ్నాప్లు బాగా పెరిగిపోయాయి అన్న విషయం తెలిసిందే. చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం ఆ తర్వాత వారి తల్లిదండ్రులను భారీగా డబ్బులు ముట్ట చెప్పాలి అంటూ బ్లాక్మెయిల్ కు దిగటం  లాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ ఆయా పిల్లల తల్లిదండ్రులు డబ్బులు చెల్లించకపోతే ఇక చిన్నారులు అని కూడా చూడకుండా దారుణంగా హతమార్చిన ఘటనలు  కూడా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఐదేళ్ళ చిన్నారిని గోనెసంచిలో కుక్కి రోడ్డుపై పడేసిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చి స్థానికంగా అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రేణు అనే పాప ను కిడ్నాప్ చేశారు.. ఇక ఆ తర్వాత ఆ పాపను గోనెసంచిలో కుక్కి  ఫాదర్ వాడి పెట్రోల్ బంకు సమీపంలో పడేశారు. ఇక సాయంత్రం 6 గంటల సమయంలో అటువైపుగా వెళ్తున్న ప్రజలు ఆ మూటను చూశారు. అయితే ఆ మూట కదులుతూ కనిపించడం తో భయాందోళనకు గురయ్యారు స్థానిక ప్రజలు. కాస్త ధైర్యం చేసి ఆ మూట విప్పి చూడగా అందులో చిన్నారి పాప కనిపించింది దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పాప తల్లిదండ్రులు ఎవరు అనే దానిపై విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: