నార్త్ కొరియా: "కిమ్" మరో దారుణానికి ఒడిగట్టాడు...!
అయితే ప్రస్తుతం ఈ దేశం నుండి వచ్చిన ఓ తాజా వార్త అందరినీ కలవరపెడుతోంది. నరరూప రాక్షసుడిగా తనకున్న చెడ్డ పేరును మరింత దృఢం చేసుకున్నాడు కిమ్. ఆయన నియంత పాలన కఠినాతి కఠిన శిక్షలు మితిమీరిపోతున్నాయి. తన మాట వినలేదని కోపంతో...తమ దేశానికి చెందిన ఓ అధికారిని బహిరంగంగా కాల్చి హత్య చేయించి అత్యంత దుశ్చర్య పనికి పాల్పడ్డాడు కిమ్. ఉత్తర కొరియాలో విదేశీ వస్తువులు నిషేదం. విదేశీ వస్తువుల అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ అక్కడ జరగకూడదని ఆంక్షలు విధించాడు ఆ దేశ అధ్యక్షుడు కిమ్. అంతేకాదు ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసుకునే వీలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో విదేశాలకు చెందిన టీవీ రేడియో చానెళ్లు ఏవీ చూడకూడదు వినకూడదు అని కఠినమైన ఆంక్షలు విధించాడు.
ప్రపంచంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోకుండా అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు అమల్లోకి తెచ్చి ప్రజల్ని కట్టుదిట్టం లో పెట్టింది. పలు రేడియోలు టీవీ చానెళ్లపై నిషేదం విధించి ప్రజల స్వేచ్ఛను హరించింది. టీవీ ఛానల్ కు మాత్రమే కాకుండా ..స్థానిక వార్త పత్రికల్లో కూడా విదేశీ వార్తలు ప్రచురణ కాకూడదని నియమాలు పెట్టింది. దీంతో అక్కడి ప్రజల్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కోల్పోయారు. అందుకని వారిలో ప్రపంచ దేశాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఈ సందర్భంగా కొందరు ప్రభుత్వం కంట పడకుండా అక్రమ మార్గాల్లో సీడీలు, పెన్ డ్రైవ్ లు మరియు మొబైళ్లను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లి అలా కొనుగోలు చేసిన వారు తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
అయితే తాజాగా ఉత్తర కొరియా ఫిష్షింగ్ బోట్ కు కెప్టెన్ గా పనిచేస్తున్న చోయ్ అనే 40 ఏళ్ల వ్యక్తిని అధికారులు బహిరంగంగా కాల్చి చంపడం సంచలనంగా మారింది. అమెరికా నిధులతో పనిచేస్తున్న రేడియో ఫ్రీ ఆసియా కథనం ప్రకారం.. ఆ దేశంలో 15 ఏళ్ల కిందటే విదేశీ రేడియో చానెళ్లను నిషేధించడం జరిగింది.. ఒకవేళ దీనిని అతిక్రమిస్తే మరణ శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా అయితే సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు ఆర్ ఎఫ్ ఏ రేడియో చానెల్ ను వింటూ అంతర్జాతీయ సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు...ఉత్తరకొరియా సైన్యంలో రేడియో ఆపరేటర్ గా పనిచేసిన చోయ్.. ప్రస్తుతం ఫిష్షింగ్ విభాగంలో పనిచేస్తున్నారు.
గతంలో విదేశాలకు సంబంధించిన వార్తలు వింటున్నారని ఈయనకు వార్నింగ్ కూడా ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అయినా సరే సముద్రంలోకి వెళ్లినప్పుడల్లా ఆ రేడియో చానెల్ వింటూ సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు అని గ్రహించిన అధికారులు...వివిధ బోట్ల కెప్టెన్లు మేనేజర్ల సమక్షంలో నుదుటి మీద గన్ పెట్టి అత్యంత క్రూరంగా కాల్చి చంపారు. ఇది మిగిలిన వారికి ఒక గుణపాఠం కావాలని హెచ్చరించారు. ఇదంతా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఆజ్ఞ కారణంగానే జరిగిందని... ఆయన దుశ్చర్యలకు ఈ ఘటన మరోసారి అద్దం పట్టిందని ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.