దుబాయిలో పాకిస్తాన్ కి ఘోర అవమానం.. ఇక లైట్ తీసుకున్నట్టేనా..?

praveen
ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. అటు ప్రపంచ దేశాల ముందు మాత్రమే కాదు ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని లైట్ తీసుకోవడం మొదలు పెట్టాయి. మొన్నటి వరకు తమతో పాటు ఒక ఇస్లామిక్ దేశంగా చూసిన దుబాయ్ సౌదీ అరేబియా లాంటి దేశాలు... ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్న పాకిస్థాన్కు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ఆదుకునేందుకు ప్రయత్నించాయి. కానీ పాకిస్థాన్ మాత్రం నీచమైన బుద్ధి తో ఏకంగా సహాయం చేస్తున్న దేశాల పైన ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించింది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే పాకిస్తాన్ తీరుతో చిర్రెత్తి పోయిన సౌదీ అరేబియా దుబాయ్ లాంటి దేశాలు పాకిస్తాన్ తో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకునేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా అయితే ఇప్పటివరకు ఇచ్చిన అనే అప్పులను  తిరిగి చెల్లించాలి అంటు ఒత్తిడి తీసుకురావడం కూడా మొదలు పెట్టింది.  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రానురాను సౌదీ అరేబియా దుబాయ్ లాంటి దేశాలు పాకిస్తాన్ ను మరింత లైట్ గా తీసుకుంటున్నాయి అన్నది అర్థం అవుతుంది. గతంలో ఏకంగా పాకిస్థాన్కు చెందిన స్థానిక అధికారి వెళ్ళినప్పుడు దుబాయ్ లో కనీస గౌరవం కూడా ఇవ్వలేదు అన్న విషయం తెలిసిందే.



 ఇటీవలే పాకిస్థాన్కు చెందిన విదేశాంగ శాఖ మంత్రి దుబాయ్ పర్యటనకు వెళ్ళిన సమయంలో కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రికి  తీవ్ర అవమానం జరిగింది అని చెప్పాలి. సాధారణంగా ఒక దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి విదేశాంగ మంత్రులు వారికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పి సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. కానీ ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి దుబాయ్ వెళ్లిన సమయంలో ఏకంగా ఒక సూపర్వైజర్ ను విదేశాంగ శాఖ మంత్రి ని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్టుకు పంపడంతో విదేశాంగ శాఖ మంత్రికి ఎంతగానో అవమానం జరిగింది అని చెప్పాలి. దీన్ని బట్టి  దుబాయ్ సౌదీ అరేబియా దేశాలు పాకిస్తాన్ ను  ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: