మరో దిశా ఘటన.. యువతి ప్రతిఘటించడంతో స్క్రూ డ్రైవర్ తో దారుణంగా..?
అయితే దిశ ఘటన తర్వాత ప్రభుత్వాలు అత్యాచార ఘటనకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించేందుకు చట్టాలు తీసుకు వచ్చినప్పటికీ ఎక్కడా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంతే కాకుండా మహిళలు అణువణువునా భయపడుతూ బతికే దారుణ స్థితికి దాపురించింది నేటి సమాజంలో. ఇక ఇటీవలే హైదరాబాద్ నగరంలో దిశ లాంటి మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
అత్యాచారానికి ప్రతిఘటించిన మహిళను ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేయడంతో పాటు ఆ తర్వాత దారుణంగా హత్య చేసిన ఘటన ఇటీవలే పోలీసు విచారణలో బయట పడింది. ఈనెల 7వ తేదీన అతి దారుణంగా హత్య చేయబడిన ఒక మహిళ మృతదేహం కేసును ఇటీవలే పోలీసులు ఛేదించారు. ఈ నెల 6వ తేదీన రాత్రి 9:30 గంటలకు నసీం ఫాతిమా అనే యువతి బిస్మిల్లా హోటల్ వద్ద ఆటో ఎక్కింది. ఈ క్రమంలోనే ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగానే ఆటో ఆపిన ఆటోడ్రైవర్ సదరు యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే యువతి ప్రతిఘటించడంతో కోపంతో ఏకంగా స్క్రూ డ్రైవర్ తో యువతి గొంతు లోపొడిచాడు. ఆ తర్వాత ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు ఆటో డ్రైవర్.