కేసిఆర్ అలా చేయకపోతే.. ఉద్యమం తప్పదు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?
రాష్ట్రం లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాల ను తెరమీదికి తెస్తూ ఇక ఆ కబ్జాల విషయం లో ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడం పై కూడా తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఇక ఇటీవలే మరో అంశాన్ని తెర మీదకు తెచ్చి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ చంద్రయాన్ గుట్ట నియోజకవర్గంలోని లలితా బాగ్ డివిజన్లో కాళికామాత దేవాలయ భూములను ఎంతో మంది అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
అయితే దేవాలయ భూములు కబ్జాలకు గురవుతున్న ప్పటికీ ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నది అంటూ మండిపడ్డారు బండి సంజయ్. ఇక ఈ కబ్జాలపై వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమం తప్పదు అంటూ హెచ్చరించారు బండి సంజయ్. తమ సహనం నశిస్తే పాతబస్తీలో ఏమవుతుందో పోలీసులు ఊహించుకోవాలి అంటూ హెచ్చరించారు. 24,25, 26 సర్వేనెంబర్ లో ఉన్న దేవాలయ భూములను ఓ హిందూ పేరు అడ్డుపెట్టుకొని ఎంఐఎం నాయకులు కబ్జా చేశారని దీనికి డిసిపి కూడా సహకరించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్.