కరోనా వ్యాక్సిన్ సామాన్యులకు చేరేదెప్పుడంటే...?

VAMSI
ప్రపంచ దేశాలను గజగజ వణికించే  కరోనా వైరస్ కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రాణాంతక వైరస్ ఊపిరి తీసే గడియలు రాబోతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం  వచ్చే ఏడాది మొదటి నెల నుండి  భారతదేశంలో కరోనా టీకాను దశల వారీగా ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఇప్పటికే ఈ విషయం పై ఎన్నో వార్తలు వచ్చాయి. భారత్‌లో కరోనా వైరస్ నివారణ టీకాలు వేయడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది. కాకపోతే అధిక జన సాంద్రత ఉన్న మనలాంటి దేశంలో.. ఒక్కసారిగా ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు, అందుకోసమే ముందుగా కరోనా వారియర్స్  కు ప్రధానంగా  హాస్పిటల్ సిబ్బంది, 50 ఏళ్ల పైబడిన ముసలి వారికి, పోలీసు అధికారులు, నాయకులకు,  వాలంటీర్ల  కు  ఇవ్వబోతున్నట్లు సమాచారం.

రోజూ ప్రతి సెషన్‌లో 100 నుంచి 200 మందికి వ్యాక్సిన్ ఇస్తారని, ఆ తర్వాత  వారిని అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఏమైనా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయా లేక అంతా సవ్యంగానే ఉందా అనేది పరిశీలిస్తారని కేంద్రం ప్రభుత్వం చెప్పినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా సాధారణ ప్రజలకు టీకా చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది...???... అప్పటివరకు కరోనా ఉద్ధృతి ఎలా ఉండబోతోంది..?? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

దేశంలోని ప్రజలందరికీ  టీకా అందడానికి మరి కొన్ని నెలల సమయం పడుతుందని సమాచారం. ఇకపోతే అప్పటివరకు కరోనా వ్యాప్తి విషయానికొస్తే...  ఎలాగో  డాక్టర్లకు, నర్సులకు, హెల్పర్స్ కు, పోలీసులకు ఇలా ప్రజలతో ఎక్కువ కాంటాక్ట్ లో ఉండే ప్రజా సేవకులకు  మొదటిగా కరోనా వ్యాక్సిన్ అందుతుంది. కాబట్టి కరోనా వ్యాప్తి ఈ విధంగా తగ్గిపోతుందని... వ్యాక్సిన్ పొందని సాధారణ ప్రజలు సైతం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ అందేవరకు ఎప్పటిలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ హాయిగా ఉండొచ్చని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: