ఆ నిజం తెలుసుకున్న గంటా ? సంచలన నిర్ణయం ?

ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటే ఆ పార్టీలోకి వెళ్లగలగడమే కాకుండా అక్కడ తనకు పెద్ద పీట ఉండేలా చేసుకోవడం లో సిద్ధహస్తుడు విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆయన ఏ పార్టీలోకి వస్తామన్నా, వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా మరి చేర్చుకుంటారు. అది గంటా స్పెషాలిటీ. ఎందుకంటే ఆయనకు విశాఖ జిల్లాలో పట్టు ఉండడమే కాకుండా,  సామాజికవర్గం అండదండలు ఉండడమే. సీనియర్ రాజకీయ నాయకుడిగానే, కాకుండా మంచి రాజకీయ వ్యూహకర్త కూడా కావడం వంటి కారణాలతో గంటాకు ఇంత ప్రాధాన్యం వచ్చిపడింది. అయితే ఆయన మొదటి నుంచి వైసీపీలో చేరదామని ప్రయత్నాలు చేస్తున్నా  అది నెరవేరకుండా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. 




వైసీపీలో చేరాలనే ఉద్దేశంతో టిడిపికి దూరంగా ఉంటూ వస్తుండడంతో, ఇటీవల చంద్రబాబు కమిటీలను నియమించినా ఆ కమిటీలో గంటా శ్రీనివాసరావు కు ఎక్కడా  స్థానం కల్పించలేదు. ఇదిలా ఉండగా వైసీపీలో తనకు పెద్దపీట వేస్తారని ఆశిస్తూ, ఆ పార్టీలో చేరేందుకు గంటా ప్రయత్నిస్తున్నా, ఆ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదనే విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించారు. తనను పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సుముఖంగానే ఉన్నా, మంత్రి అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డి వంటివారు అడ్డుకుంటున్నారు అనే విషయాన్ని గంటా గుర్తించారు. అందుకే ఇక ఆయన టిడిపిలోనే ఉండాలని డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు. 




తాజాగా ఎంవిపి కాలనీ లోని తన స్వగృహంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక నేతలతో కలిసి విశాఖ నార్త్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టిడిపిని బలోపేతం చేసేందుకు మనమంతా కృషి చేయాలని, అన్ని వార్డుల్లో పార్టీ కమిటీలను నియమించి, అన్ని వార్డులలోని ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి సూచించారు. ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తనను సంప్రదించాలని గంట ప్రకటించడం చూస్తే,  త్వరలోనే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో తన పట్టును నిరూపించుకుని రాజకీయంగా మరింత బలపడాలనే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీలో చేరికకు ఎన్నో అడ్డంకులు ఏర్పడటంతో పాటు,  ఇప్పుడు ఆ పార్టీలో చేరినా, కొత్తగా చేసేది ఏమీ లేదు అనే అభిప్రాయంతోనే టిడిపిలో నే ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: