భారత్ సిద్ధమవుతోంది.. భారీగా యుద్ధనౌకలు లీజుకి..?
రష్యా ఆయుధాలు ఎలాంటి క్వాలిటీ తో ఉన్నా అవే కొనుగోలు చేస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం భారత్ తీరు మార్చుకుంది... విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం కాదు ఏకంగా ఇతర దేశాలకు ఆయుధాల ను విక్రయించే దిశగా ప్రస్తుతం భారత్ విజయవంతం గా అడుగులు వేస్తుంది. ఈ క్రమం లోనే ప్రస్తుతం భారత రక్షణ శాఖ మరింత పటిష్టవంతంగా మారిపోతుంది అయితే తక్కువ ఖర్చుతో నే ఎక్కువగా ఆయుధాలను సమకూర్చుకునే విధంగా ప్రస్తుతం భారత రక్షణ శాఖ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే గత కొన్ని రోజుల నుంచి భారత రక్షణ పరిశోధన సంస్థ శరవేగంగా ఆయుధాల ను అభివృద్ధి చేస్తోంది.
అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుధాలు వచ్చే విధంగా ప్రస్తుతం ప్లాన్ చేస్తుంది. అయితే వేల కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధ విమానాల ను యుద్ధ నౌకలను కొనే కంటే ప్రస్తుతం లీజ్ తీసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతోనే విమానాలను యుద్ధ నౌకలను వాడుకునేందుకు సిద్ధం అయ్యింది భారత రక్షణ శాఖ. ఈ క్రమంలోనే ఏకంగా 15 యుద్ధవిమానాల వాహకాలు అయిన యుద్ధ నౌకలను లీజుకు తీసుకుంది భారత రక్షణశాఖ. దీంతో మరింత బలం చేకూరింది.