ఆవేశపడిన అల్లుడు... చివరికి ఎంతపని జరిగిపోయింది..?

praveen
ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కడా కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడంతో తరచూ మనస్పర్థలు వచ్చి విడిపోతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. అదే సమయంలో...  భార్య కాపురానికి రావడం లేదు అనే కారణంతో ఎంతో మంది భర్తలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కొన్ని తెరమీదికి వస్తూ ఉంటే ఏకంగా భార్య పై పగ పెంచుకుని దారుణంగా హతమార్చేందుకు  కూడా సిద్ధపడుతున్న ఘటనలు మరికొన్ని తెర మీదకు వస్తున్నాయి ఇక్కడ ఇలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది.



 కూతుర్ని కాపురానికి పంపించడం లేదు అన్న కారణంతో అత్త పై కోపం పెంచుకున్నాడు అల్లుడు.  ఎన్నిసార్లు అడిగినా తన భార్యను కాపురానికి పంపడం లేదు అనే కారణంతో క్షణికావేశంలో దారుణంగా అత్తను  పొడిచేసాడు అడ్డొచ్చిన బావమర్ది పై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు వెంటనే మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కటకటాల వెనుకకు తోసారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కర్నూలు పాతబస్తీ ఏరియా బండి మెట్ట కు చెందిన మహబూబ్ బాషా కి బంగారు పేట కు చెందిన మునిరాబి  కూతురు మెహమ్ముదా  తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది.



 మొదట్లో వీరి సంసారం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మెహబూబ్  బాషా చెడు  వ్యసనాలకు బానిస గా మారి తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు దీంతో భర్త వేధింపులు తాళలేక భార్య తల్లి ఇంటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే భార్యను కాపురానికి పంపించాలి అంటూ భాష అత్త తో గొడవ పడేవాడు. అయితే ఇది ఎంత అడిగినా కూతురుని కాపురానికి పంపడం లేదు అనే కారణంతో అత్త పై  పగ పెంచుకున్నాడు భాష.  ఈ క్రమంలోనే ఓ  రోజు కోపంలో ఏకంగా అత్త ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా పొడిచాడు అడ్డు వచ్చిన బావమరిది పై కూడా దాడి చేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల నిందితున్ని అరెస్టు చేయగా న్యాయస్థానం అతనికి జీవితఖైదు విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: