విద్యార్థులకు భారీ షాక్.. మార్చి 31 వరకూ స్కూళ్లు బంద్..?
ఈ క్రమంలోనే దాదాపుగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు పునః ప్రారంభం కాలేదు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్తు కాస్త అయోమయంలో పడిపోయింది. అయితే విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలి అనేదానిపై ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాఠశాల ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం పాఠశాలలు బంద్ చేసేందుకు నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న పాఠశాలలను... వచ్చే ఏడాది మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ఇటీవలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించబోము అంటూ స్పష్టం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... కేవలం ప్రాజెక్టు పనులు ఆధారంగానే విద్యార్థుల మార్కులను నిర్ణయిస్తాము అంటూ తెలిపారు.