గ్రేటర్ యుద్ధం : అది తలుచుకుని వణికిపోతున్న బీజేపీ టీఆర్ఎస్

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయిపోయింది. ఓటర్ ఎటు వైపు మొగ్గు చూపుతాడో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. దీంతో టిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీలు ఆందోళనతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడూ లేనంత టెన్షన్ కలిగిస్తున్నాయి. ఓటింగ్ శాతం ఎవరికి నష్టం చేకూరుస్తుందో అని లెక్కలు వేసుకుని అన్ని పార్టీలు అభ్యర్థులు గెలుపు అవకాశాలను పార్టీ అధినాయకత్వానికి నివేదిక రూపంలో అందిస్తున్నారు. పైకి ఎంత గంభీరంగా గెలుపు మాది అంటే మాది అని చెబుతున్నా , నాయకుల్లో మాత్రం ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నా, లోలోపల తీవ్ర ఆందోళన చెందుతోంది.



 2016లో గ్రేటర్ ను ఏ విధంగా సొంతం చేసుకున్నామో ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాకపోతే ఘోరంగా దెబ్బతింతాము అని కంగారు పడుతోంది. ఇటీవల గ్రేటర్ పరిధిలో సంభవించిన వరదల కారణంగా ప్రజలు తమ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్ విషయాన్ని తెలుసుకుని టిఆర్ఎస్ అడ్డం పడుతోంది. అయితే ఓటింగ్ శాతం తగ్గడం తమకు అనుకూలంగా మారుతుందని కాస్త ఊరట చెందుతుంది. టిఆర్ఎస్ కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ స్థాయి నాయకులు , మండల నాయకులు, ఇలా అందరూ గ్రేటర్ పరిధిలో విజయం కోసం ప్రయత్నించారు. కేటీఆర్ అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ వచ్చారు. బిజెపి విషయానికి వస్తే పోలింగ్ శాతం తగ్గడం ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. 




గ్రేటర్ విజయం తమ వైపు ఉంటుంది అనుకుంటున్న సమయంలో , ఓటింగ్ శాతం పెరిగితే తమకు అనుకూలంగా ఉంటుందని . కానీ అది జరగలేదు. మరోవైపు వరుస సెలవులు వచ్చిన సమయంలోనే పోలింగ్ తేదీ ఉండడం కూడా ఓటింగ్ తగ్గడానికి కారణంగా బిజెపి భావిస్తోంది. దీని అంతటికీ కెసిఆర్ కారణమని, కావాలనే ఈ విధంగా ఎన్నికల పోలింగ్ తేదీ వచ్చేలా చేశారని ఆరోపణలు చేస్తోంది. ఇక ఎంఐఎం విషయానికి వస్తే, తమకు మంచి పట్టు ఉన్న పాతబస్తీ వంటి చోట్ల కూడా ఓటింగ్ తగ్గడం పై ఆ పార్టీ సైతం ఆందోళనగా ఉంది. మరి కొద్ది గంటల్లో ఫలితాలు తేలే అవకాశం ఉండడంతో గ్రేటర్ పీఠంపై ఎవరి జెండా ఎగురుతుందో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: