కొత్త కార్ కొనాలనుకునే వారికి శుభవార్త.. కేవలం ఈఎంఐ రూ.లు 1900..?
అయితే కారు కొనుగోలు చేయాలి అనుకునే వారు ముందుగా కొన్ని విషయాలను గమనించాల్సివుంటుంది. లోన్ పై వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంది అనే దాన్ని ముందుగా లోన్ తీసుకునే వారు గమనించాలి. అంతేకాకుండా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి అనే విషయాన్ని గ్రహించి ఆ బ్యాంకులు లోన్ తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పవచ్చు. అలా అయితే మీ పై ఎక్కువగా ఈఎంఐ భారం పడకుండా ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే కార్ లో అందించేందుకు సిద్ధమైంది. కేవలం 6. 85 శాతం నుంచి మాత్రమే వడ్డీ ప్రారంభమవుతుంది.
అంటే లక్ష లోన్ తీసుకుంటే 1973 రూపాయలు ప్రతి నెలా చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తక్కువ వడ్డీకే ప్రస్తుతం కార్ లోన్ అందించేందుకు సిద్ధమైంది. ఇక బ్యాంకులో కార్ లోన్ తీసుకుంటే 7.1 శాతం నుంచి వడ్డీ రేటు స్టార్ట్ అవుతుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు లో కూడా ఇదే స్థాయిలో వడ్డీ రేటు కొనసాగుతుంది యూనియన్ బ్యాంకులో 7.15 శాతం.. కెనరా బ్యాంకు లో 7.3 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీరేటు 7.3 శాతం నుంచి స్టార్ట్ అవుతూ ఉండగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియా... 7.35 శాతం వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్ లోన్ వడ్డీ 7.7 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది.