వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. బెనిఫిట్స్ ఏంటంటే..?
ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ తమ తమ వినియోగదారులందరూ ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంది అన్న విషయం తెలిసినదే. ఇటీవలే మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. కొత్త గా తీసుకొచ్చిన ఫీచర్ ద్వారా వాల్ పేపర్ గ్యాలరీ అందుబాటులో ఉంటుంది.. గ్యాలరీ ఫీచర్ ప్రస్తుతం అందరి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వాట్సాప్ మరింత కలర్ ఫుల్ గా మారిపోయింది అని చెప్పవచ్చు. ఇక ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ప్రతి చాట్ కూడా ఒక ప్రత్యేకమైన వాల్ పేపర్ పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే ఈ సరికొత్త వాల్ పేపర్ ఫీచర్ లో 30 లైట్.. 30 డార్క్ వాల్ పేపర్లను ప్రస్తుతం అందుబాటులో ఉంచినట్లు వాట్సాప్ తెలిపింది.
ఒకవేళ మీరు వాడుతున్న మొబైల్ డార్క్ మోడ్ లోకి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా వాట్సాప్ యొక్క వాల్ పేపర్ కూడా డార్క్ మోడ్ లోకి మారిపోయే విధంగా ఈ సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. ఇక అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ టుగెదర్ ఎట్ హోమ్ అనే దానికి సంబంధించి స్టిక్కర్ ప్యాకెజ్ కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది వాట్సప్. అయితే ఇప్పటికే ఎంతో అద్భుతమైన ఫీచర్లు అందుకుంటున్న వాట్సాప్ వినియోగదారులు... ప్రస్తుతం సరికొత్త ఫీచర్లతో మరింత కలర్ ఫుల్ గా వాట్సాప్ మారడంతో మరింత ఆనంద పడిపోయే అవకాశం ఉంది.