గ్రేటర్ యుద్ధం : పట్నమోళ్ళు కాదు.. ఊరోళ్లే నయం..?
సాధారణంగానే ఏ సమస్య వచ్చినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పొరపాటున ఏదైనా సమస్య వచ్చి ఓటు హక్కు వినియోగించుకో లేకపోయారు అంటే ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అయితే గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే నగరాల్లో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. నాగరిక సమాజానికి కాస్త దూరంగా ఉన్న గ్రామల ప్రజలు ఓటు హక్కును బాధ్యతగా భావిస్తూ ఉంటే.. టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న నగరవాసులు మాత్రం ఓటు ను లైట్ తీసుకుంటున్నారు. గొప్ప చదువులు చదివి ఉన్నత ఉద్యోగంలో ఉండి అందరికీ ఆదర్శంగా నిలవాల్సినది పోయి అందరి చేత విమర్శల పాలవుతున్నారు ప్రస్తుతం నగరంలోని ఓటర్లు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన పరిస్థితి దీనికి నిదర్శనంగా మారిపోయింది ప్రతిసారి జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినప్పుడు గ్రేటర్ ఓటర్లు తమ ఓటు హక్కు ఉంది అన్న విషయాన్ని మరిచిపోయి మరి హాయిగా ఇంట్లోనే కూర్చుంటారు. ఒక్కరు కూడా ఇల్లు దాటి బయటకు వెళ్లి ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎంతో బాధ్యతగా వ్యవహరించి ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకున్ని ఎన్నుకుని తమ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సి ఉంది... పోయి గ్రేటర్ ఓటర్ మాత్రం గ్రామాల్లో ప్రజల కంటే దారుణం గా వ్యవహరిస్తున్నారు నిన్న కనీసం ఓటర్లు ఇల్లు దాటి బయటకు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో అన్ని పార్టీలకు భారీ షాక్ తగిలింది.