గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

VAMSI
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారాల్లో హైదరాబాద్ ను చుట్టేస్తున్న ప్రజా ప్రతినిధులు. ప్రతిపక్ష పార్టీల విమర్శల వరదతో మునిగిపోతున్న భాగ్యనగరం. గ్రేటర్ ఎన్నికల కోసం కేంద్రం నుండి తరలి వస్తున్న నేతలు... రాజకీయరంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో సతమతమౌతున్నారు ప్రజలు. బాబోయ్ జరుగుతున్నది గ్రేటర్ ఎన్నికలా లేక కేంద్రానికి సంబంధించిన ప్రధాన ఎలక్షన్ లా అంటూ ఆశ్చర్యపోతున్నారు జనం. ఎవరికి వారు గ్రేటర్ పీఠం మాదే అంటున్న తీరు. ఇలా రసాభాసగా సాగుతోంది ఎన్నికల ప్రచారం. ఇటు తెలంగాణ అధికార పార్టీ విజయం మాదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. గత ఆరేళ్లలో ప్రజలు మా గురించి పూర్తిగా తెలుసుకున్నారు.

ప్రజలకు చేయూత గా నిలబడే ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని వారు నమ్ముతున్నారు. అందుకు మా పాలన లోని పారదర్శకతే నిదర్శనం... పెరిగిన అభివృద్దే సాక్ష్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు కమల నాథులు అనవసరంగా అపోహ పడుతున్నారంటూ.... ఈసారి గెలుపు మాదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీ ఎవరి సొత్తు కాదని.. ఈసారి అక్కడ బీజేపీ పాగా వేయబోతుందని... శాశ్వతంగా పాతుకు పోతుందని ప్రజల అండ దండలు మాకు తోడుగా ఉన్నాయని... కాబట్టి మా గెలుపును చూడడానికి సిద్ధంగా ఉండాలంటూ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి నిజామాబాద్‌ మేయర్‌ పీఠం.. మజ్లిస్‌ అండ ఉండబట్టే టీఆర్‌ఎస్‌ దక్కించుకుందన్నారు.

ఇప్పుడు కూడా ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వారి ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమైందంటే  నమ్మదగ్గ విషయం కాదని... ప్రజలు అంత అమాయకులు కాదని వ్యాఖ్యానించారు. రేపు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులైన అమిత్‌ షా హైదరాబాద్ వస్తున్నారని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: