గ్రేటర్ యుద్ధం : వారి కోసం హోటళ్లు లాడ్జీలు బుకింగ్..?

praveen
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందో లేదో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జిహెచ్ఎంసి ఎన్నికలను తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా చాటాలని అన్ని  పార్టీలు  ప్రస్తుతం ఊహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను బరిలోకి దింపిన ఆయా పార్టీలు.. ప్రస్తుతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు మొదలు పెట్టాయి అన్న విషయం తెలిసిందే. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తాము అధికారంలోకి వస్తే కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామూ  అంటూ ప్రస్తుతం హామీల వర్షం కురిపిస్తున్నారు.



 ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు జిల్లాల నేతలను రంగంలోకి దింపి ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్నాయి.  ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉండి హైదరాబాద్ లో ఓటు కలిగి ఉన్న వారిని ప్రస్తుతం అభ్యర్థులు అందరూ హైదరాబాద్ రప్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు అందరినీ ఆకట్టుకునే విధంగా ఆయా జిల్లాల ముఖ్య నేతలను రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తున్నారు. తద్వారా ఆయా ఓటర్లను ప్రసన్నం చేసుకుని తమ వైపు తిప్పుకునేందుకు ప్రస్తుతం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు..




 ఇక బూత్ స్థాయిలో ప్రతి ఓటు కూడా తమకే వచ్చే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న  ప్రధాన పార్టీలు స్థానిక నేతలు అందరిని రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి స్థానిక నేతలను జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం నిమిత్తం వివిధ పార్టీలు హైదరాబాద్ కు రప్పిస్తున్నాయి. ఆయా  నేతలకు ఏకంగా హోటళ్లు లాడ్జీలు బుక్ చేస్తున్నాయి. దీంతో వివిధ జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు ప్రస్తుతం శరవేగంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల వార్  కాస్త మరింత ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: