ఆంద్రప్రదేశ్ పోలిసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు....
రైతులను అరెస్ట్ చేసేందుకు ఎందుకు సరైన కారణాలు చూపించలేదని ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖపై హైకోర్టు చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కారం కింద తీసుకొనే అధికారం ఉందని కూడా హైకోర్టు న్యాయ స్థానం స్పష్టంగా వెల్లడించింది. పోలీసులు మన భారతదేశ రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని, ఇలా చేస్తే ప్రజలు ఎక్కడకెళ్తారని తప్పుబట్టింది.
పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్ కూడా సరిగా లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలా అయితే ‘రూల్ ఆఫ్ లా’ ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది.కాగా, ఈ మధ్యనే రాజధాని అయిన అమరావతిలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బేడీలు వేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే కొందరు ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ విషయం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన కారణంగా తాజాగా హైకోర్టు సైతం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది..ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ ల గురించి తెలుసుకోండి....