కెనడాలో చదువు.. ఫేస్ బుక్ లో ఉద్యోగం.. కానీ గంజాయి ఎంత దిగజార్చిందో తెలుసా..?
ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మంచి చదువులు చదువుకున్నారు.. విదేశాలకు వెళ్ళాడు అక్కడ మంచి ఉద్యోగం సంపాదించాడు.. అంతలోనే చెడు అలవాట్లు అతని దరి చేరాయి. జల్సాలకు అలవాటు పడ్డాడు. గంజాయి కి బానిస గా మారిపోయాడు. దీంతో ఉద్యోగం కూడా ఊడిపోయింది. చివరికి ఒక సంస్థలో డెలివరీ బాయ్ గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ సదరు యువకుడు తీరు మార్చుకోలేదు. గంజాయిని తరలించడం మొదలు పెట్టాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
ఇటీవల హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది.. కెనడాలో ఉన్నత చదువులు చదివిన సికింద్రాబాద్కు చెందిన బాలాజీ సింగ్ అనే యువకుడు అక్కడే ఫేస్బుక్ లో ఉద్యోగం సాధించాడు. మంచి ఉద్యోగం మంచి వేతనం వస్తున్నప్పటికీ చెడు అలవాట్లు దారి చేరి గంజాయికి బానిస గా మారిపోయాడు. దీంతో కంపెనీ యాజమాన్యం అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి డెలివరీ బాయ్ గా మారిన సదరు యువకుడు ఆతర్వాత గంజాయి విక్రేతలకు మీడియేటర్ గా మారాడు. ఇటీవలే అతనిపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్టు చేశారు.