వై ఎస్ జగన్ పై కత్తి దాడి కేసు: రెస్టారెంట్ ఓనర్ కు హై కోర్ట్ ఊరట...!
విశాఖను రాజధానిగా వైసీపీ సర్కార్ నిర్ణయిచడంతో అక్కడ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ ఆక్రమణలను స్వాధీనం చేసుకునే పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ రెస్టారెంట్ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి భాస్కర్ రావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన అక్రమంగా ఆక్రమించుకున్న భూములు అంటూ నిర్ధారించి శనివారం ఆ ఆక్రమణలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అగ్రహారంలో ఆయన ఆధ్వర్యంలో 124 ఎకరాల భూమి ఉంది. ఇందులో 64 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. ఈ 64 ఎకరాలను స్వాధీనం పరచుకుంది ప్రభుత్వం. కాంపౌండ్ వాల్ ను ...షెడ్లు.. గేట్లు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
ఇక సిరిపురంలోని ఫ్యూజన్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్ ఉన్న 4.84 ఎకరాల భూమిలో ఆక్రమణలు కూల్చివేసి విశాఖ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చిన లీజు గడువు దాటి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.... చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. చంద్రబాబు సన్నిహితుడు టి. హర్షవర్ధన్ ప్రసాద్ కు చెందిన హోటల్ గా దీన్ని చెబుతున్నారు. అయితే ఇది ప్రస్తుతం సమస్యలో చిక్కుకుంది.
దీంతో మాజీ మంత్రి గంటా ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ న్యాయం చేయాలంటూ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ‘యథాతథ స్థితి’(స్టేటస్ కో)ని పాటించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలంటూ.. న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ విషయంలో అంతర్గతం గా రాజకీయ అంశాలు దాగి ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు... అలాగే రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి ప్రధానమని ఆరోపణలున్నాయి. దాడి చేసిన శ్రీనివాస్ కు సహాయం చేసింది హర్షవర్ధనే అన్న ఆరోపణలు వచ్చాయి..ఈ నేపథ్యంలోనే హర్షవర్ధన్ ఫ్యూజన్ రెస్టారెంట్ ను ఏపీ సర్కార్ కూల్చడం స్వాధీనం చేసుకోవడం ఒక భాగమని టాక్ వినిపిస్తోంది.