దారుణం : పబ్జి ఆడేందుకు మొబైల్ ఇవ్వలేదన్న కోపంతో..?
ఆడుతూ పబ్జి బానిసలుగా మారిపోయి రుగ్మతలు ఏర్పడి గుండె పోటు వచ్చి మరణించిన వారు కొంతమంది అయితే పబ్జి ఆడకూడదు అని తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నవారు మరికొంతమంది. తాజాగా మరో ప్రాణాన్ని బలితీసుకుంది పబ్జి. గేమ్ ఆడటానికి తన స్నేహితుడు మొబైల్ ఇవ్వలేదు అని కోపంతో... స్నేహితుడు అని కూడా చూడకుండా ఉన్మాదిగా మారిపోయిన బాలుడు స్నేహితుని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రాజస్థాన్ లో జరిగింది ఈ ఘటన. రాజస్థాన్ కీ చెందిన 14ఏళ్ల బాలుడు అతని స్నేహితుడు హమీద్ మొబైల్ లో పబ్జి గేమ్ ఆడేవారు. రోజు గంటల తరబడి పబ్జి గేమ్ ఆడుతూ కాలయాపన చేసే వారు. అయితే హమీద్ ఫోన్లో తరచూ ఇద్దరు బాలురు పబ్జి గేమ్ ఆడుతూ ఉండేవారు. అయితే ఈనెల 9వ తేదీన హామీద్ పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. ఏమై ఉంటుందా అని వెళ్లి చుస్తే పబ్జి ఆడేందుకు మొబైల్ ఇవ్వలేదని కోపంతో బాలుడు హమీద్ తలపై బండరాయితో మోదటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ నిజాలు అన్నీ పోలిస్ విచారణలో బయట పడ్డాయి.