హెచ్డీఎఫ్సి బాటలోనే మరో బ్యాంక్.. కస్టమర్లకు ఝలక్..?
ఇటీవల తమ బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకొని కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది యాక్సిస్ బ్యాంక్. ఇక ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 13 నుంచి అమలులోకి వస్తాయని తమ కస్టమర్లు వీటిని గమనించాలి అంటూ సూచించింది. ఇక అన్ని రకాల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది యాక్సిస్ బ్యాంక్. ఇక యాక్సిస్ బ్యాంక్ తీసుకున్న సరికొత్త నిర్ణయం ప్రకారం నవంబర్ 13 నుంచి డిపాజిట్లపై సరికొత్త వడ్డీ రేట్లు ఇలా ఉండనున్నాయి.
ఇప్పుడు బ్యాంక్‌లో 7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్డీలపై 2.5 శాతం వడ్డీ లభిస్తోంది. 30 రోజుల నుంచి 3 నెలల ఉంటే 3 శాతం వడ్డీ..3 నెలల నుంచి ఆరు నెలలలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.5 శాతంగా.. ఆరు నెలల నుంచి 11 నెలల 25 రోజుల ఎఫ్డీలపై 4.4 శాతం.. 11 నెలల 25 రోజుల నుంచి ఏడాది 5 రోజుల ఎఫ్డీలపై 5.15 శాతం.. ఏడాది 5 రోజుల నుంచి 18 నెలల కాల పరిమితిలోని ఎఫ్డీలపై 5.1 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇక 18 నెలల నుంచి 2 ఏళ్లలోపు ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.25 శాతం.. 2 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు 2.5 శాతం నుంచి 6.05 శాతం మధ్యలో వడ్డీ వస్తుంది.