వైరల్: ప్రణయ్ చివరి కోరిక ఇదేనట!
ఎంతగా ప్రయత్నించినా... ప్రియురాలు తన ఆవేదనను గుర్తించకపోవడంతో మానసిక వేదనకు లోనై.... ప్రియురాలికి తనకు ఇక తనకు దక్కదు అన్న ఆలోచన తట్టుకోలేక.. ప్రణయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ సమయంలో కూడా ప్రణయ్ చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది... తాను మరణించిన అనంతరం తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్ లో రాశాడు.తన శవాన్ని వైద్య పరిశోధనలకు వినియోగించేలా చూడాలని తన తల్లిదండ్రులకు లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు. తను తిరిగి రాదు అని మాత్రమే మోసం చేయలేదని.... అంతకు ముందు మరో ఆరుగురు అమాయకులను ఇలాగే నమ్మించి మోసం చేసిందని.... అది తెలియక తాను ప్రేమించి మోసపోయానని చనిపోయేముందు వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు ప్రణయ్.
తన కుమారుడి మరణాన్ని భరించలేని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రణయ్ తండ్రి నారాయణ స్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ...ప్రేమ పేరుతో తన కొడుకును ఆ అమ్మాయి మోసం చేసి బలి తీసుకుందని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో పెళ్లి ఇప్పుడే వద్దంటూ మాయమాటలు చెప్పిందని .. ఆ అమ్మాయిపై ఆమె తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన కొడుకు ప్రణవి ప్రాణాన్ని బలి తీసుకున్న యువతి కుటుంబంపై తాను న్యాయపోరాటానికి దిగుతానని మీడియాతో పేర్కొన్నారు.