తన కోపమే తన శత్రువు అంటారు.. అది నిజమే అని పెద్దలు కూడా అంటారు.. అయితే భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజం..వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలి.. లేదంటే మాటా మాటా పెరిగి గొడవలు తీవ్ర రూపాన్ని దాల్చి చివరికి ప్రాణాలను తీయడమో లేక మరే ఇతర కారణాలతో కుటుంబం మద్య గొడవలను పెంచుతాయి..కోపం ఎదురుగా ఉన్న శత్రువు కన్నా కూడా డేంజర్ అని.. క్షణకాలం ఉండే కోపంతో చాలా మంది దారుణాలను చేస్తున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే..ఒకరిని మరొకరు చంపుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు ఎదురైంది..
వివరాల్లోకి వెళితే.. ఓ భర్త తన కోపాన్ని భార్య మీద చూపించాడు..ఆమెను అతి దారుణంగా ఆవేశంలో చంపేశాడు. ఆ భయం తో పారి పోతుంటే రైలు మృత్యువు రూపంలో వచ్చి అతన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నవీముంబై పరిధిలోని తలోజా ఫేజ్2, నవ్‌డా గ్రామంలో నివాసముంటున్న గణేష్ దుర్గుడేకి భార్య, ఏడాదిన్నర వయసున్న కూతురు ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న గణేష్ రెండు రోజుల కిందట భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణగా మారడంతో ఆగ్రహానికి లోనైన గణేష్ భార్యను అనేక సార్లు కత్తితో పొడిచాడు..దాంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయ్యి చనిపోయింది.
దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.. రక్తపు మడుగులో పడి ఉన్న గణేష్ భార్యని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఉదయం 8.30 గంటల సమయంలో భార్యభర్తలు గొడవపడ్డారని.. ఆ తరువాత భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు.ఆ తర్వాత అతను కూడా రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు..భార్య భర్తలు ఇద్దరు చనిపోవడంతో చిన్నారి అనాధగా మారింది..ఈ ఘటన స్థానికులను కదిలించి వేస్తుంది..