రేవంత్ కు ఆ ఇంచార్జ్ బాధ్యతలు ? ఆయన వైపే అధిష్టానం మొగ్గు ?

తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకుడు , ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా కనిపిస్తున్న రేవంత్ రెడ్డి పై ఆ పార్టీ అధిష్టానానికి పూర్తికి నా ముఖం కనిపిస్తుంది. ఆయన ఆధ్వర్యంలోనే తెలంగాణలో ఎప్పటికైనా కాంగ్రెస్ బలం పుంజుకుంటుందనే అభిప్రాయంలో ఉంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడం, అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ,  కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపై విమర్శలు చేస్తూ,ప్రతి దశలోనూ వారిని అడ్డుకుంటూ వస్తుండడం వంటి కారణాలతో అధిష్టానం రేవంత్ పై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ప్రభావం నుంచి నాయకులు ఇంకా కోలుకోలేదు.


 ఆ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పైన పడుతుందని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతోంది. దీని నుంచి పార్టీని ఒక ఒడ్డును పడేసేందుకు, టిఆర్ఎస్ బిజెపి హవా కనిపించకుండా చేసేందుకు గ్రేటర్ కాంగ్రెస్ బాధ్యతలు మొత్తం రేవంత్ చేతిలోనే పెట్టాలని, ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా,  రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న  మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గ్రేటర్ పరిధి ఎక్కువగా ఉండడంతో, ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో,  ఆయన పర్యటన లోనే గ్రేటర్ మేనిఫెస్టో తో పాటు , ప్రచారం ,నిర్వహణ ఇన్చార్జిల నియామకం, అభ్యర్థుల ఎంపిక వంటి వాటిని పూర్తి చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. 


రేవంత్ దూకుడుతో గ్రేటర్ లో ఇప్పటికే బలం పెంచు కునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోవడం, దానికి సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ చేయడం, వాటి పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోవడం వంటి వ్యవహారాలపై గట్టిగానే పోరాడుతున్నారు.ఇటీవల జిహెచ్ఎంసి ముట్టడి సైతం చేసి ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రేవంత్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై గట్టిగా పోరాడుతున్నారు. దీంతో ఆయనకు గ్రేటర్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: