సుప్రీమ్ కోర్ట్ బెయిల్ మంజూరు: అర్నాబ్ గోస్వామి గెలిచాడు...!
అయితే ఇటీవలే ఆయన తాత్కాలిక బెయిలు కోసం మంజూరు చేయగా.. ముంబై హైకోర్టు అర్నాబ్ గోస్వామి బెయిల్ ను అంగీకరించలేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు అర్నాబ్. తనను అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐ తో విచారణ చేయించేందుకు అనుమతించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణను కూడా ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీంతో విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే ఇప్పుడు ఎట్టకేలకు అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. అర్నాబ్ తో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. అయితే ఈ కేసులో ఈ నెల 4వ తేదీన అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.. మొదట్లో అర్నబ్ బెయిల్ కోసం దాఖలు చేయగా... వాటిని తిరస్కరించింది హైకోర్టు... కాగా ఇప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సుప్రీం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు మున్ముందు ఎన్నెన్ని మలుపులు తీసుకుంటుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.