వైసిపి హైకమాండ్ మీద ఎదురు తిరిగిన ఎమ్మెల్యే లు వీళ్లేనా...?

VAMSI
రాజకీయరంగంలో ఇదో కొత్త పరిణామం..... ఏకంగా హైకమాండ్ మీదే ఎదురు తిరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు... మాటల యుద్ధాల మధ్య పార్టీ పరువు. ఇంతకు మునుపు ఎపుడూ చూడని విధంగా అధికారపక్షంలోచోటు చేసుకున్న ఈ విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.... అధినేతకు వెన్నంటే ఉండి... అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునే జగన్ కు ప్రియతమ నేత గా పిలవబడే విజయసాయిని టార్గెట్ చేసిన తీరు ఇప్పుడు ప్రభంజనం గా మారింది. అది కూడా నాలుగు గోడల మధ్య అయితే పర్వాలేదు.... బహిరంగంగా జరిగిన డీడీఆర్ సీ సమావేశంలో కావటం వలన విషయం కాస్త సీరియస్ గా మారింది....

 విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న విజయసాయి మరియు కరణం ధర్మశ్రీ కి మధ్య కోల్డ్ వార్ జరిగింది.. నేరుగా ఒకరినొకరు పాయింట్ అవుట్  చేస్తూ మాట్లాడిన విధానం హాట్ టాపిక్ గా మారింది.తాము నిజాయితీపరులమే అంటూ ధర్మశ్రీ తనకు తానుగా చెప్పుకురావాల్సి రావటం ఒక ఎత్తు అయితే.. వీటికి మద్దతు పలకాల్సిన వ్యక్తి.... దీనికి భిన్నమైన వ్యాఖ్యలు విజయసాయి నోటి నుంచి రావడం మరో ఎత్తు అయింది. అనందపురం మండలం పాలవలసలో మాజీ సైనికుడికి చెందిన భూమిని ధర్మశ్రీతో పాటు.. మరికొందరు కొనుగోలు చేసినట్లుగా చెబుతుంటారు . దీనిపై గతంలో చాలా వార్తలు వచ్చాయి ఇప్పటికీ ఈ విషయంపై చర్చ జరుగతోంది. ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్ శాఖపై ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి.

ఇప్పుడు ఈ విషయం పైనే ఈ ఇరు నేతల మాటల యుద్ధం మొదలైంది.డీడీఆర్సీ సమావేశంలో ఈ భూముల గురించి రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఈ అంశాల్ని  ప్రస్తావించారు దీనికి కారణం కూడా ఉండనే ఉంది. ఈ భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సిన ఎన్ వోసీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ అంశాల్ని పరోక్షంగా గుర్తు చేసేలా విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఆక్రమణ వెనుక రాజకీయ నేతలు ఉన్నారని పేర్కొన్నారు.
దానికి వెనువెంటనే స్పందించిన ధర్మశ్రీ... విజయసాయి మాటలను ఖండించారు.పదే పదే రాజకీయ నేతలు అని ప్రస్తావించడం  బాగోలేదని.. తాము కూడా నిజాయితీపరులమేనని.. ప్రజల కొరకే నిరంతరం పాటుపడుతున్నామని... నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో ఇష్టమని పేర్కొనటం. ఓవైపు జగన్ కు అత్యంత సన్నిహితుడి మాటల్ని తప్పు పడుతూనే.. మరోవైపు జగన్ తమకు ఇష్టమని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ తన రాజకీయ ఎక్స్పీరియన్స్ ను ప్రదర్శించినట్లు అనిపించింది.సదరు భూముల విషయంలో చట్టబద్ధత లేకుంటే విచారణ జరిపించాలే కానీ.. ఇలా ప్రతిసారీ రాజకీయ నేతలు అంటూ ప్రస్తావించటం బాగోలేదన్నారు ధర్మశ్రీ..... ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగి విషయం కాస్త సీరియస్ గానే మారింది..... మరి ఈ అంశం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: