హరీష్ పై పెరిగిపోతున్న సానుభూతి ?

కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు పై ఇప్పుడు సానుభూతి పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందిన దగ్గర నుంచి అంతా హరీష్ రావు కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటమి బాధ్యతలు మొత్తం హరీష్ తీసుకోవాల్సిందేనని, ఇక అభ్యర్థి గెలుపు బాధ్యతలు ఆయనే స్వీకరించారని, అన్ని తానే ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయనే దీనికి సమాధానం చెప్పాలంటూ టీఆర్ఎస్ లో ఒక వర్గం నాయకులు హడావుడి చేస్తున్నారు. అయితే టిఆర్ఎస్ తరఫున అన్ని తానే, హరీష్ ప్రచారం నిర్వహించారు అని, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న హరీష్ ఒక్కడే ఈ బాధ్యతలను మోస్తూ గట్టిగా కష్టపడ్డారని, బహిరంగ సభలు, సమావేశాలు , రాజకీయ వ్యూహాలు అన్ని ఆయన నిర్వహించారని, ఎన్నికల సమయంలో గట్టిగా కష్టపడినా ఫలితం దక్కలేదని , దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని, కేవలం హరీష్ ను టార్గెట్ చేసుకోవడం సరికాదంటూ మరో వర్గం తమ వాదనలు వినిపిస్తున్నాయి. 



ఇదిలా ఉంటే అసలు ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి తప్పదు అనే విషయం టిఆర్ఎస్ అగ్రనేతలు అందరికీ తెలుసునని, అందుకే కెసిఆర్ వ్యూహాత్మకంగా కేసీఆర్ ను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారని, ఓడిపోతే హరీష్ ను చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని టిఆర్ఎస్ పెద్దలు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అని, ఇలా ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి.అది కాకుండా ఇక్కడ ఓటమి బాధ్యత మొత్తం తనదేనని హరీష చెప్పడంతో ఇంకా ఆయనపై సానుభూతి  పెరిగిపోతోంది. టిఆర్ఎస్ లో హరీష్ రావు హవాను తగ్గించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిలో భాగంగానే దుబ్బాకలో ఓటమి బాధ్యతలు మొత్తం హరీష్ ఖాతాలో వేసి, ఆయనను బలిపశువు చేసేందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. 


ఇదంతా కెసిఆర్ కుమారుడు కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకే, ఈ తతంగమంతా నడిపిస్తున్నారు అంటూ ఆయనపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఒకవేళ దుబ్బాక ఎన్నికలను సాకుగా చూపించి హరీష్ పై కెసిఆర్ ఏమైనా చర్యలు తీసుకున్నా, అది టిఆర్ఎస్ పార్టీకే తీరని నష్టం చేకూరుస్తుందనే విశ్లేషణలు ఇప్పుడు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: