చైనా దూకుడు అందుకే తగ్గింది.. భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..?
అయితే చైనా దాడితో భారత్ వెనుకంజ వేస్తోంది అని చైనా భావించినప్పటికీ.. ఎంతో దీటుగా ఎదురు నిలబడి సరైన సమాధానం చెప్పింది భారత ఆర్మీ. దీంతో ప్రస్తుతం సరిహద్దు లో భారత్ పై ఆధిపత్యం సాధించాలి అనుకొన్న చైనాకు... భారత దూకుడుతో అయోమయ స్థితిలో పడిపోయింది. అయితే గత కొన్ని రోజుల నుంచి చైనా సరిహద్దుల్లో కాస్త దూకుడు తగ్గించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చైనా ప్రస్తుతం కాస్త ప్రశాంతంగా ఎందుకు ఉంది అన్నది గా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదంపై భారత ఎయిర్ ఫోర్స్ చీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత వాయుసేన ఎంతో సమర్థవంతంగా చైనా కుయుక్తులను తిప్పికొట్టింది భారత వాయుసేన చీఫ్ మార్షల్ బదౌరియా అన్నారు. భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి కట్టుదిట్టమైన గస్తీ నిర్వహించాము అంటూ చెప్పుకొచ్చారు. అందుకే చైనా తన దుందుడుకు చర్యలను తగ్గించింది అంటూ వ్యాఖ్యానించారు. సుఖోయ్, మీరేజ్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలతో సరిహద్దులో పహారా నిర్వహించినట్లు అంటూ ఆయన తెలిపారు. అయితే సరిహద్దుల్లో శాంతిని ఆకాంక్షిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ బదౌరియా.