
ఆన్లైన్ గేమ్ తో 20 లక్షలు స్వాహా.. పోలీస్ స్టేషన్ వెళితే మరో నిజం బయటపడింది..?
అతను ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడాడు... పోలీసులు ఆన్లైన్ రమ్మీ గేమ్ ను రాష్ట్రంలో నిషేధించినప్పటికీ ఏదో ఒక విధంగా ఆన్లైన్ రమ్మి గేమ్ ఆడాడు. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ రమ్మి గేమ్ ఆడుతున్న వారు లక్షల్లో నష్టపోయి చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ రమ్మి గేమ్ ఆడి మోసపోవద్దు అని అటు పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన అవగాహన చర్యలు చేపట్టిన ఎక్కడ ఎవరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇలా ఆన్లైన్ గేమ్ ద్వారా మోసపోతున్న వారు ఎక్కువవుతున్నారు.
ఇటీవల ఓ వ్యక్తి ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడి ఏకంగా 20 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక 20 లక్షలు పోగొట్టుకొని లబోదిబోమంటూ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళాడు సదరు వ్యక్తి. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ పై నిషేధం ఉంది కదా.. మరి ఎలా ఆడావ్ అంటూ అతడిని ప్రశ్నించారు పోలీసులు. దీంతో మరో నిజాన్ని కూడా బయటపెట్టాడు సదరు వ్యక్తి. నకిలీ జీపీఎస్ లొకేషన్ తో ఆన్లైన్ రమ్మీ ఆడినట్లు చెప్పాడు దీంతో అతని లాగానే మరికొంతమంది కూడా ఇలా ఆన్లైన్ రమ్మి ఆడుతున్నట్లు గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.