ఆత్మ నిర్బర్ భారత్ నినాదం కాదు.. మోదీ కీలక వ్యాఖ్యలు..?

praveen
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థలో కూడా క్రమక్రమంగా వృద్ధి రేటు సాధిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే లా దూసుకుపోతున్నది  భారత్. ఎంతో వ్యూహాత్మకమైన ప్రణాళికలతో దౌత్య పరంగా కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను మొత్తం భారత్ లో  పెట్టుబడులు పెట్టే విధంగా ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక నిర్ణయాలు  తీసుకుంటూ ప్రపంచ దేశాలు దృష్టి మొత్తం భారత్ వైపు ఆకర్షిస్తుంది  కేంద్ర ప్రభుత్వం.



 కరోనా  సంక్షోభంలో కూడా సంక్షేమ వైపుగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఆత్మ నిర్బర్  భారత్ పేరుతో  కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య సంక్షోభంలో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది భారత ప్రభుత్వం. కరోనా  సంక్షోభం కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎంతో మంది ప్రజలకు చేయూతనివ్వడమే  కాదు... చిన్న మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడం దేశంలో అభివృద్ధిని పరుగులు పెట్టించడం కోసం కూడా ఎన్నో ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అటు ప్రతిపక్షాలు మాత్రం ఆత్మ నిర్బర్ భారత్ అనే కేంద్రం తీసుకొచ్చిన సరికొత్త కార్యక్రమం ద్వారా దేశంలో అభివృద్ధి జరిగింది ఏమీ లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.



కాగా   ఇటీవలే ప్రపంచంలోని టాప్ 20 ఇన్వెస్ట్మెంట్ కంపెనీలతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఆత్మ నిర్బర్  భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆత్మ నిర్బర్  భారత్ కేవలం ఒక నినాదం మాత్రమే కాదని.. అద్భుతంగా తయారు చేసిన భారత వ్యూహం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వర్చువల్ సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు అన్నింటికీ తయారీ కేంద్రంగా భారత్ ను  మారుస్తాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి భారత్ కంటే అనువైన దేశం మరేది లేదు అంటూ వ్యాఖ్యానించిన నరేంద్ర మోడీ... వ్యవసాయ చట్టాల ద్వారా ప్రపంచ వ్యాపారులు నేరుగా రైతులతో భాగస్వాములుగా అయ్యేందుకు అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: