కలకలం రేపుతున్న కిడ్నాప్ కేసులు.. రాములమ్మ కీలక వ్యాఖ్యలు..?

praveen
తెలంగాణ రాష్ట్రం లో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కిడ్నాప్ కేసులు  కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు ఎంత నిఘా ఏర్పాటు చేసిన ఏదో ఒక విధంగా కిడ్నాప్ కేసులు మాత్రం పెరిగిపోతూ నే ఉన్నాయి. దీంతో కనీసం కాలు బయట పెట్టాలి అంటేనే భయపడి పోతున్నారు జనాలు. పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసిన కిడ్నాప్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

 ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రజలకు సరైన రక్షణ కల్పించక పోవడంతో నే రాష్ట్రంలో కిడ్నాప్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని  ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై  తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ తీరుని  ఎండగడుతూ ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత విజయశాంతి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న కిడ్నాప్ కేసుల ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

 తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి పెరిగిపోతున్న కిడ్నాప్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి అంటూ ఇటీవలే సినీనటి తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏకంగా 200 మంది కిడ్నాప్ కి గురవడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తోంది అంటూ విజయశాంతి తెలిపారు.  రాష్ట్రంలో క్రమక్రమంగా పెరిగి పోతున్న కిడ్నాప్ ఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు విజయశాంతి. ప్రజలందరిలో  కలవరం మొదలు కాకముందే అందరూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అటు క్రమక్రమంగా పెరిగి పోతున్న కిడ్నాప్ కేసులో తెలంగాణ ప్రజానీకం మొత్తం భయాందోళనలో మునిగి పోతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: