పాఠశాల కు పంపేందుకు భయపడుతున్న పేరెంట్స్.. ఎందుకో తెలుసా..?
పాఠశాలల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉంటూనే.. ప్రతిరోజు విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కూడా నిర్ణయించింది అంతేకాకుండా రోజు విడిచి రోజు విద్యాబోధన చేయడంతో పాటు కేవలం ఒంటి పూట మాత్రమే విద్యా బోధన చేసేందుకు నిర్ణయించింది జగన్ సర్కార్. అయితే జగన్ సర్కార్ మొత్తంగా పాఠశాల ను ప్రారంభించిన మొదటి రోజు నుంచే పాఠశాలలో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తుండడం అందరిని భయాందోళనకు గురిచేస్తుంది.
క్రమక్రమంగా ఏపీలోని పాఠశాలలకు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా సోకుతూ ఉండడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాలో నాలుగు జడ్పీ హైస్కూల్లో టీచర్లు విద్యార్థులకు కరోనా సోకింది. కేవలం ప్రకాశం జిల్లాలోనే కాదు మరికొన్ని జిల్లాలలో కూడా ఇలా స్కూళ్లలో కరోనా వైరస్ కేసుల సంఖ్య బయట పడుతూ ఉండడం ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇలా క్రమక్రమంగా కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న నేపథ్యంలో పాఠశాలకు తమ పిల్లలను పంపాలి అంటేనే భయపడిపోతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు. ఇక రోజురోజుకు పాఠశాలలో కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న నేపథ్యంలో దీనిపై జగన్ సర్కార్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందని అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.