గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బిజెపి గూటికి వెళ్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్టుగానే ఆమె గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఇటీవల దుబ్బాక నియోజకవర్గం లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పాల్గొనలేదు. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ , ఆ పార్టీతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి , తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ అయ్యారని ఆమెకు బిజెపిలో సముచిత స్థానం కల్పించేందుకు బిజెపి అధిష్టానం హామీ ఇచ్చిందని బీజేపీ గూటికి వెళ్ళిపోతారు అని ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు వరకు విజయశాంతి మాత్రం కాంగ్రెస్ లో ఉంటానని కానీ బిజెపి లో చేరబోతున్నాను అని చెప్పకపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆమె వ్యవహారం ఇలా ఉండగా, తాజాగా ఈరోజు సాయంత్రం
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్
విజయశాంతి ని ఆమె నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది . ఆమె
పార్టీ మారే ఆలోచనలో ఉండటంతో ఆమెను బుజ్జగించేందుకు ఆయన విజయ శాంతి నివాసం కి వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీలో మీకెప్పుడు సముచిత స్థానం ఉంటుందని , తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని, ఠాగూర్
విజయశాంతి ని బుజ్జగించి నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆమె
కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను టగూర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయి అని, ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తనను పట్టించుకోవడం లేదని ,కీలకమైన సమావేశాలకు తనను పిలవడం లేదని చాలా కాలంగా ఆమె గుర్రు గా ఉంటూ వస్తున్నారు.