పాకిస్తాన్ కి భారీ షాక్ ఇచ్చిన ఫ్రాన్స్.. ఇదే సరైన సమాధానమా..?

praveen
సాధారణం గా కొన్ని దేశాల నుంచి విద్య ఉద్యోగ ఉపాధి కోసం అగ్రరాజ్యాలకు వెళ్తూ ఉంటారు ఎంతమంది. పాకిస్తాన్ సిరియా లాంటి దేశాల లో మాత్రం విద్య ఉద్యోగం కోసం వెళ్తారు  గాని ఇతర దేశాలకు వెళ్లి అక్కడ మత  రాజ్య స్థాపన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక్కడ పౌరులు. అందరూ ఇతర దేశాలలో కి వెళ్లినప్పటికీ సాధారణ ప్రజల లాగానే జీవిస్తూ ఉంటే కొంతమంది మాత్రం మత రాజ్య స్థాపన కోసం మిగతా వారిని ప్రభావితం చేస్తూ ఉంటారు.  రోజు రోజుకు ఇలా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు తమ దేశ ప్రజల మతాన్ని అగౌరపరుస్తు  ప్రాణాలు తీస్తున్నారని గుర్తించిన ఫ్రాన్స్  ప్రభుత్వం.. సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.



 ఎవరైనా దేశం లో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజానికి పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే వారిని ఎక్కడికక్కడ కాల్చివేయాలి అంటూ సంచలన ఆదేశాలు కూడా జారీ చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటనపై పాకిస్థాన్  తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ తమ దేశంలో ఉన్న మైనారిటీల విషయంలో దారుణంగా వ్యవహరిస్తూ మత మార్పిడి జరిగితే కానీ పాకిస్తాన్ లో జీవించే హక్కు లేదు అనే తీరుగా  వ్యవహరిస్తుంది.



 తమ దేశంలో తిండి పెట్టకుండా కనీసం ఉద్యోగం కల్పించకుండా భావప్రకటన హక్కు కల్పించకుండా మైనారిటీల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్.. ఫ్రాన్స్  లో జరుగుతున్న ఘటనలపై మాత్రం అతిగా స్పందిస్తోంది. నీతులు  వల్లిస్తూ ఉంది. ఇటీవలే  ఫ్రాన్స్ అధ్యక్షుడు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ  విమర్శలు చేసింది పాక్. దీంతో అంతే వేగంగా స్పందించిన ఫ్రాన్స్.. 181 మంది పాకిస్తాన్ మత విద్వేషాలను సృష్టించే వారిని ఫ్రాన్స్ నుంచి బయటకి పంపింది. దీంతో పాకిస్తాన్ కి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: