భారత్ చైనా యుద్ధం.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై చైనా ఆశలు..?

praveen
భారత్ చైనా సరిహద్దుల్లో రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. శీతాకాల పరిస్థితులు వచ్చి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నప్పటికి కూడా సైనికులు ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో వస్తూనే ఉన్నారు. ఒకవైపు చైనా సైనికులు ముందుకు అడుగు వేయడం లేదు మరోవైపు భారత సైనికులు కూడా వెనక్కి తగ్గడం లేదు.. వెరసి రోజురోజుకీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లడక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి ప్రమాదకర పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే లడక్ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.




 అయితే లడక్ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే దానిపై ఇటీవలే భారత రక్షణ రంగ నిపుణులు నితిన్  గోకలే  ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. గత కొన్ని రోజుల క్రితం లడక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -0 డిగ్రీల కంటే దిగువన ఉన్నాయి.. అధికారికంగా లడక్ ప్రాంతంలో శీతాకాలం ప్రకటించబడింది.. అయితే చైనా భారత సరిహద్దుల్లో మూడు వారాల నుంచి కమాండర్ స్థాయి చర్చలు జరగలేదు. ప్రస్తుతం ఇరు దేశాల సైన్యాలు తప్పనిసరిగా సరిహద్దుల్లో ఒకరినొకరు పరిశీలిస్తూ ఉండాల్సి వస్తుంది. 1962 తర్వాత ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఇదే మొదటిసారి. భారత సేనలు అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో సంవత్సరాలనుంచి పహారా కాస్తూ ఎంతో అనుభవం సాధించాయి కానీ చైనా సైనికులకు మాత్రం ఇది మొదటి అనుభవం.



 ఇంత చలి ప్రాంతంలో చైనా సైనికులు ఎలా తట్టుకోవాలి పహారా కాస్తారు అన్నది  ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం చైనా చర్చలకు దిగకపోవడం చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు నితిన్ గోకులే. అయితే శీతాకాలంలోనే చైనా భారత తో యుద్ధానికి దిగుతుందా లేక వేసవికాలంలో యుద్దానికి  దిగుతుందా అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేదాన్ని బట్టి చైనా ముందు ముందు ఎలా స్పందించాలి అనేది నిర్ణయించబడుతుంది అని ఆయన అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: