ఆ సీనియర్ నేతని బాబు మళ్ళీ బలి చేయనున్నారా?
ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున పనబాక లక్ష్మీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో పనబాకని మళ్ళీ పోటీలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారట. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే తిరుపతి పార్లమెంటులో వైసీపీ గెలవడం ఖాయం. ఎందుకంటే తిరుపతిలో వైసీపీ బలంగా ఉంది. పైగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో తన గెలుపు కష్టమని పనబాక లక్ష్మి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బల్లి ఫ్యామిలీకి సానుభూతి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరు తిరుపతిలో గెలవడం కష్టం. దీంతో పనబాక పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు, వర్ల రామయ్య పేరుని తెరపైకి తీసుకొస్తున్నారు. తిరుపతి బరిలో వర్లని నిలబెట్టాలని బాబు చూస్తున్నారని సమాచారం. ఇప్పటికే వర్లని బాబు పలుసార్లు బలిచేశారు. ఆయనకు పలుసార్లు కీలక పదవుల విషయంలో అన్యాయమే జరిగింది. అలాగే ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకపోయినా సరే వర్లని నిలబెట్టారు. దీంతో వర్ల ఘోరంగా ఓడిపోయారు.అలాగే వర్ల 2014లో కృష్ణా జిల్లా పామర్రు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం సీటు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఓడిపోయే తిరుపతి సీటు నిల్చోబెట్టాలని చూస్తున్నారు. దీని బట్టి చూస్తే వర్లని చంద్రబాబు మరోసారి బలి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.